‘నారాయణ’లో జాతీయ సాంకేతిక సదస్సు

ABN , First Publish Date - 2022-05-29T03:57:22+05:30 IST

నగరంలోని నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం సీఎస్‌ఈ, ఎంఈసీ, సీఐవీ విభాగాలు సంయుక్తంగా జాతీస్థాయి సాంకేతిక సదస్సు నిర్వహించారు.

‘నారాయణ’లో జాతీయ సాంకేతిక సదస్సు
విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలను తిలకిస్తున్న ప్రతినిధులు

నెల్లూరు (విద్య), మే 28 : నగరంలోని నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో శనివారం సీఎస్‌ఈ, ఎంఈసీ, సీఐవీ విభాగాలు సంయుక్తంగా జాతీస్థాయి సాంకేతిక సదస్సు  నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా కళాశాలలో ఇలాంటి సాంకేతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, దీంతో విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు దోహదపడుతుందని తెలిపారు. అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలను తిలకించి అభినందించారు. అలాగే విద్యార్థులకు కోడింగ్‌, క్విజ్‌, పోస్టర్‌ ప్రజంటేషన్‌, పేపర్‌ ప్రజంటేషన్‌లతో పాటు ట్రెజర్‌ హంట్స్‌, ఫొటోగ్రఫీ, జూక్‌ బాక్స్‌, పికాచు తదితర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్‌ సీనియర్‌ మేనేజర్‌ షేక్‌ పఠాన్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ ఈఈ బాలచందర్‌, ఏపీ జెన్‌కో ఎస్‌ఈ వై.సత్యనారాయణ, కార్యక్రమ కన్వీనర్‌ డాక్టర్‌ సీ.రాజు, డాక్టర్‌ ఏవీఎస్‌.శ్రీధర్‌, ఫ్రొఫెసర్‌ వెంకటలక్ష్మి, కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఏవీఎస్‌ ప్రసాద్‌, వివిధ విభాగాధిపతులు, నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-29T03:57:22+05:30 IST