హైదరాబాద్: హోటల్ దస్పల్లాలో కంభంపాటి రామ్మోహనరావు రాసిన ‘‘నేను.. తెలుగుదేశం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభ సదరా సంభాషణల మధ్య ఆహ్లాదకరంగా సాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణపై జోకులేశారు. ఇదే సమయంలో నారాయణ కీలక వ్యాఖ్యలు చేశఆరు. 83 కాంగ్రెస్ వ్యతిరేక గాలిలో కమ్యూనిస్టులకు రావాల్సిన అధికారాన్ని.. ఎన్టీఆర్ ఎగరేసుకువెళ్లారని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చింది ఎన్టీఆరేనని కొనియాడారు. ఇప్పుడు నాయకులు ఎప్పుడు ఏపార్టీలో ఉంటున్నారో అర్థంకావట్లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో స్నేహాన్ని రైలు పట్టాలతో నారాయణ పోల్చారు. రైలు పట్టాలు ఎప్పుడు కలవవు.. విడిపోవని వ్యాఖ్యానించారు. సీఎం జగన్కు చంద్రబాబుతో పోలికే లేదని చెప్పారు. పార్టీల మధ్య శత్రుత్వం ఉండకూడదని నారాయణ హితవుపలికారు.
ఇవి కూడా చదవండి