దేశద్రోహం చట్టం రద్దు చేయాలి: నారాయణ

ABN , First Publish Date - 2022-05-02T02:07:46+05:30 IST

దేశద్రోహం అనేది గతించిన చట్టం. బ్రిటీష్‌వాళ్ల సంప్రదాయంతో వచ్చింది. దానిని రద్దు చేయాలి. ఇటువంటి చట్టాలను పార్లమెంట్‌లో సవరణ ద్వారా

దేశద్రోహం చట్టం రద్దు చేయాలి: నారాయణ

రాజమహేంద్రవరం: ‘దేశద్రోహం అనేది గతించిన చట్టం. బ్రిటీష్‌వాళ్ల సంప్రదాయంతో వచ్చింది. దానిని  రద్దు చేయాలి. ఇటువంటి చట్టాలను పార్లమెంట్‌లో సవరణ ద్వారా మాత్రమే చేయగలం. ఇది ఈ కాలానికి వర్తించని చట్టం కాబట్టి దీనిని రద్దు చేయాలి’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని చట్టాలను మార్చాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన సూచన చాలా గొప్పదన్నారు. కోర్టులు, ప్రభుత్వాల మధ్య న్యాయం విషయంలో సాంకేతిక ఇబ్బందులు లేని సంబంధాలు ఉండాలన్నారు. ఇవాళ కోర్టు తీర్పులను ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు కూడా ధిక్కరిస్తున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ వల్ల భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని, లౌకిక వ్యవస్థకూ ముప్పు ఉందని, మేడే స్పూర్తితో వీటిపై పోరాడాలని నారాయణ పిలుపునిచ్చారు.

Updated Date - 2022-05-02T02:07:46+05:30 IST