BJPకి ఒక్కసారి అవకాశం ఇస్తే..ఉరి వేసుకున్నట్లే: Narayana

ABN , First Publish Date - 2022-05-15T16:22:29+05:30 IST

బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే.. ఒక్కసారి ఉరి వేసుకున్నట్లేని సీపీఐ నేత నారాయణ అన్నారు.

BJPకి ఒక్కసారి అవకాశం ఇస్తే..ఉరి వేసుకున్నట్లే: Narayana

హైదరాబాద్: బీజేపీ (BJP)కి ఒక్కసారి అవకాశం ఇస్తే.. ఒక్కసారి ఉరి వేసుకున్నట్లేని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై బీజేపీకి స్పష్టమైన రాజకీయ వ్యూహం లేదని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బీజేపీ ధ్వంసం చేసిందని మండిపడ్డారు. విభజన చట్టంలో హామీలను అమలు చేయకుండా మాటలకే పరిమితమైందని, వ్యతిరేక చట్టాలను సీఎం కేసీఆర్ సమర్థించారని ఆరోపించారు. బీజేపీ రాజకీయ బలం పెంచుకోవటానికి టీఆర్ఎస్ అవకాశం కల్పించిందని, ఒక్క అవకాశమని బీజేపీ అడుక్కోవడం సిగ్గుచేటని నారాయణ ఎద్దేవా చేశారు.

Updated Date - 2022-05-15T16:22:29+05:30 IST