ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. లేదంటే..: నారాయణ

ABN , First Publish Date - 2020-09-30T18:26:49+05:30 IST

విశాఖ జిల్లాలోని కొమ్మాదిలో ఆక్రమణకు గురైన భూములను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం పరిశీలించారు.

ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. లేదంటే..: నారాయణ

విశాఖ: జిల్లాలోని కొమ్మాదిలో ఆక్రమణకు గురైన భూములను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ బుధవారం పరిశీలించారు. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తామే ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని అన్నారు.


ఈ సందర్భంగా నారాయణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం ఇక్కడ నిర్మించిన గోడను పగులగొట్టామని.. ఆనాడు తమపై ఎవరూ కేసుపెట్టలేదన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం బోర్డు పెట్టిందని.. కొన్నాళ్ల తర్వాత ఆ బోర్డు మాయమైందన్నారు. మళ్లీ ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ భూమి అని.. అలా కాకుండా ప్రైవేటు భూమి అయితే అసలైన యజమానులు ముందుకు రావాలని, పత్రాలు చూపించాలన్నారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే ఈ భూమిని స్వాధీనం చేసుకుని, పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తే.. అందుకు తాము మద్దతు తెలుపుతామని నారాయణ స్పష్టం చేశారు.

Updated Date - 2020-09-30T18:26:49+05:30 IST