Jul 9 2021 @ 23:01PM

విడుదలకు వేళాయె

బుల్లితెర నటుడు నందకిశోర్‌, వెండితెరకు కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘నరసింహపురం’. శ్రీరాజ్‌ బళ్లా దర్శక-నిర్మాత. ఈ నెల 23న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరాజ్‌ బళ్లా మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ ఓరియెంటెడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. థియేటర్లు ఎప్పుడు ఓపెన్‌ చేస్తారోనని ఎదురుచూస్తున్నాం. ప్రస్తుతానికి 23న విడుదల చేయాలనుకుంటున్నాం. టి. ఫణిరాజ్‌ గౌడ్‌, నందకిశోర్‌ ధూళిపాలతో కలిసి చిత్రాన్ని నిర్మించా. వాళ్ల సహకారం మరువలేను’’ అని చెప్పారు. సిరి హనుమంతు హీరోయిన్‌గా, ఉష హీరో సోదరిగా నటించిన ఈ చిత్రానికి ఫ్రాంక్లిన్‌ సుకుమార్‌ స్వరకర్త.