త్రివిక్రముడుగా దర్శనమిచ్చిన నృసింహుడు

ABN , First Publish Date - 2022-01-19T05:32:30+05:30 IST

వరాహలక్ష్మీనృసింహుడు త్రివిక్రముడుగా భక్తులకు దర్శనమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రారంభమైన వార్షిక రాపత్తు ఉత్సవాలలో ఆరవ రోజు మంగళవారం బలిచక్రవర్తి గర్వమణచే సందర్భంలో నింగి, నేలపై చెరో కాలును మోపిన అలంకరణలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని అలంకరించారు.

త్రివిక్రముడుగా దర్శనమిచ్చిన నృసింహుడు
త్రివిక్రముడుగా అప్పన్నస్వామి

సింహాచలం, జనవరి 18: వరాహలక్ష్మీనృసింహుడు త్రివిక్రముడుగా భక్తులకు దర్శనమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ప్రారంభమైన వార్షిక రాపత్తు ఉత్సవాలలో ఆరవ రోజు మంగళవారం బలిచక్రవర్తి గర్వమణచే సందర్భంలో నింగి, నేలపై చెరో కాలును మోపిన అలంకరణలో స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని అలంకరించారు. రెండు చేతుల్లో సుదర్శన, పాంచజన్యాలను, మరో రెండు చేతుల్లో పద్మం, గదాయుధాలు ధరించిన తీరులో దేవాలయ పురోహితులు, అలంకారి కరి సీతారామాచార్యులు స్వామిని అలకరించిన తీరు భక్తులను తన్మయంలో ముంచెత్తింది. అనంతరం స్వామివారిని పల్లకిలో ఉంచి సాయంత్రం 5 గంటలకు తొలుత ఆలయ బేడామండపంలో తిరువీధి నిర్వహించి, అష్టదిక్పాలకులకు పూజలు చేశారు. ఉత్తర రాజగోపురం నుంచి బయటకు తీసుకువచ్చి సింహగిరి మాడవీఽధిలో మరో పల్లకిలో నలుగురు ఆళ్వార్లను ఉంచి, వేదపండితులు చతుర్వేదాలను ఆలపించగా, సన్నాయి వాయిద్యాలు, భక్తుల హరినామ స్మరణల నడుమ వైభవంగా తిరువీధి ఉత్సవాన్ని జరిపారు. పలువురు భక్తులు తులసి మాలలు సమర్పించి దైవానికి ఆహ్వానం పలికారు. దేవాలయ స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌, అర్చకులు ఐ.పవన్‌కుమార్‌ పూజలు నిర్వహించారు. 


Updated Date - 2022-01-19T05:32:30+05:30 IST