ఐరావత వాహనంపై నారసింహుడు

ABN , First Publish Date - 2022-05-20T06:18:25+05:30 IST

మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీనరసిం హస్వామి బ్రహో త్సవాలలో భాగంగా గురువారం ఐరావత, సూర్యప్రభ వాహనోత్సవాలపై స్వామివారు విహరించారు.

ఐరావత వాహనంపై నారసింహుడు

ఉరవకొండ, మే 19: మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీనరసిం హస్వామి బ్రహో త్సవాలలో భాగంగా గురువారం ఐరావత, సూర్యప్రభ వాహనోత్సవాలపై   స్వామివారు  విహరించారు. ఈ సందర్భంగా ఆల యంలో స్వామివారికి ప్రత్యేక పూ జలు, అభిషేకాలు నిర్వహించారు.  శ్రీదేవి, భూదేవి సమేతుడైన స్వామి వారిని మేళ తాళాల మధ్య ఊరేగిం పుగా తీసుకువచ్చి సూర్యప్రభ వాహ నంపై కొలువుదీర్చారు. ఉత్సవ మూర్తు లను ఆలయం చుట్టూ ఊరేగించారు. ఈ కార్యక్రమానికి అనంతపురానికి చెందిన నారాయణస్వామి  కుటుంబ సభ్యులు  దాత లుగా వ్యవహరించారు.  రాత్రి ఐరావ త వాహనంపై స్వామివారు దర్శనమిచ్చారు.  ఈ కార్యక్రమానికి పెద్దముష్టూరు చెందిన నెట్టం జయచంద్ర, ఎర్రిస్వామి ఉత్సవ ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఈవో విజయ్‌ కుమార్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ అశోక్‌, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.

నేడు బ్రహ్మరథోత్సవం

 మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టమైన బ్రహ్మరథోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఈఓ విజయ్‌కుమార్‌ గురువారం తెలిపారు. ఉదయం మడుగు తేరు అనంతరం సాయంత్రం 4 గంటలకు రథోత్స వాన్ని నిర్వహిస్తామన్నారు. 

Updated Date - 2022-05-20T06:18:25+05:30 IST