వ్యయసాయం

ABN , First Publish Date - 2021-09-09T05:36:16+05:30 IST

జలాశయాలు నిం డాయి.. సాగునీరు పుష్కలంగా అందుతోంది.. కానీ వరి సాగు మందకొడిగా సాగుతోంది.

వ్యయసాయం
: నరసరావుపేట ప్రాంతంలో బీడుగా ఉన్న వరి సాగు చేసే భూమి

సాగుకు ముందుకురాని కౌలుదారులు

వేధిస్తున్న వ్యవసాయ కార్మికుల కొరత

పెరిగిన ఇంధనం, ఎరువుల ధరలు 

బీళ్లుగా వదిలేస్తున్న భూయజమానులు

సాగర్‌ ఆయకట్టులో మారుతున్న సాగు చిత్రం 


నాగార్జున సాగర్‌ కుడికాలువ ఆయకట్టులో వరి సాగు సంక్షోభంలో పడింది. కౌలుకు వరిసాగు చేసేందుకు రైతుల ముందుకు రావడంలేదు. వ్యవసాయ కార్మికుల కొరత అన్నదాతలను వెంటాడుతోంది. ఇంధనం, ఎరువుల ధరలు పెరగడంలో సాగు ఖర్చూ పెరిగింది. భూములున్న రైతులు సాగు చేయ లేక, కౌలుకు ఇవ్వలేక అవస్థలు పడుతు న్నారు.  సాగర్‌ జలాశయం నిర్మించి, కుడి కాలువకు నీటి సరఫరా చేసిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడ లేదని రైతులు చెబుతున్నారు. 


నరసరావుపేట, సెప్టెంబరు 8: జలాశయాలు నిం డాయి.. సాగునీరు పుష్కలంగా అందుతోంది.. కానీ వరి సాగు మందకొడిగా సాగుతోంది. సాగర్‌ ఆయకట్టు కింద  దాదాపు 2,49,434 ఎకరాలు మగాణి ఉన్నా.. ఏటా సుమారు 3లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో లక్షన్నర ఎకరాల్లో కౌలు రైతులే వరి పండిస్తారు. కానీ రెండేళ్ల నుంచి ఆ పరిస్థితి తారుమారైంది. ఆగస్టు మొదటివారంలోనే సాగునీరు విడుదల చేసినా నకరికల్లు మండలంలో వరినాట్లు మందకొడిగా సాగుతున్నాయి. ఆయకట్టు మొత్తంలోనే వరిసాగు ఈ మండలంలో అధికం. ఈ మండలంలోని పలు గ్రామాల్లో 12 నుంచి 15 బస్తాల వరకు ఎకరం కౌలుకు చేసేవారు. ప్రస్తుతం 3 బస్తాల నుంచి 8 బస్తాలకు పడిపోయింది. కొన్ని గ్రామాల్లో ఈ కౌలుకు కూడా రైతులు తీసుకోవడం లేదు. దీంతో భూ యజమానులు సొంతగానే సాగు చేసుకోవలసి వస్తోంది. ఇలా చేసుకోలేని రైతులు భూములను పంట వేయకుండా బీళ్లుగా వదిలేస్తున్నారు. కొందరైతే సాగుకు పెట్టుబడి పెడతామని కౌలు రైతులను బతిమిలాడు కుంటున్నారు. 


పత్తి, మిరప ఆశాజనకం

కుడి కాలువ కింది 6,74,263 ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో 4,24,829 ఎకరాల మెట్ట భూములు ఉన్నాయి. ఏట్టా పత్తి వేసేవారు ఈ ఏడాది మిరపసాగుకు మొగ్గు చూపుతున్నారు.  మిరప సాగుకు కౌలు ఎక్కుగానే ఉంది. చెల్లిస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు కౌలు ఇస్తున్నారు.  పత్తి సాగుకు ఎకరాకు కౌలు రూ.10 వేలు చెల్లిస్తున్నారు. వరితో పోల్చుకుంటే పత్తి, మిరప పంటల సాగుకు కౌలు ఆశాజనకంగా ఉంది. 


సున్నా, పావలా వడ్డీ పథకాలకు తిలోదకాలు

సాగుకు పెట్టుబడి కూడా ప్రధాన సమస్యగా మారింది. గత ప్రభుత్వం హయాంలో పావలా, సున్నా వడ్డీ, పథ కాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నాయి. నేడు సున్నా వడ్డీ పథకాన్ని నామమాత్రంగా కూ డా అమలు చేయడం లేదు. పావలా వడ్డీ అందని ద్రాక్షగా మారింది. రైతు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పునకు వడ్డీతో సహా ఏడాదిలో చెల్లించాలి. లేకుంటే వడ్డీ  పెరిగిపోతుంది. గతంలో లక్ష వరకు అప్పునకు వడ్డీ లేకుం డానే సొసైటీలు రుణాలు వసూలు చేసేవి. నేడు వడ్డీతో సహా చెల్లించాల్సి వస్తోంది. కౌలు రైతులకు పంట రుణాల పథకం అంతంత మాత్రంగానే అమలు చేస్తున్నారు. రుణ మంజూరు కార్డుల పంపిణీలో కూడా అలసత్వం నెలకొంది. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు లభించ డంలేదు. దీంతో ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. 


అటు ఇస్తూ... ఇటు లాగేసుకుంటూ..

రైతులు వ్యవసాయ రుణాలకు గతంలో రూ.3 లక్షల అప్పునకు వడ్డీ రూ.7 వేలు చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం రూ.3 లక్షల అప్పు తీసుకుంటే వడ్డీ రూ.21 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. రైతు భరోసా సొమ్మును వడ్డీ రూపంలో ప్రభుత్వం లాగేసుకుంటోందని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.   చేయూత నిచ్చే దిశగా ప్రభుత్వం సహకరించాలని రైతులు కోరుతున్నారు.


కార్మికుల కొరత.. ధరాభారం

వరి సాగుకు సంక్షోభానికి కార్మికుల కొరత ప్ర ధాన కారణంగా ఉంది. కూలీ రేట్లు భారీగా పెరిగాయి. వ్యవసాయ పనుల కంటే ప్రధానంగా నిర్మాణ రంగంలో ఎక్కువగా కూలీ ఉంది. దీంతో ఈ పనుల వైపు వ్యవసాయ కార్మికులు వెళుతున్నారు. ఈ పనుల కోసం గ్రామాల నుంచి వ్యవ సాయ పనులు చేసేవారు పట్టణాలకు వలసలు వెళువెతున్నారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంది. ఇంకోవైపు ఇంధనం, ఎరువుల పెరుగుదల సాగుపై ప్రభావం చూపుతోంది. ఎన్నో వ్యయ ప్రయాసలను అధిగమించి పండించిన ధాన్యానికి గిట్టు బాటు ధర లభించడంలేదు. అన్ని ధరలు పెరుగు తున్న స్థాయిలో మద్దతు ధర పెరగడం లేదు. దీంతో సాగుపై భారం పడుతోంది.   

Updated Date - 2021-09-09T05:36:16+05:30 IST