జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని ప్రకటించాలి

ABN , First Publish Date - 2022-01-29T06:02:29+05:30 IST

నరసాపురం జిల్లా కేంద్రాన్ని నరసాపురాన్నే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ ఇండియా బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం ఆందోళన నిర్వహించారు.

జిల్లా కేంద్రంగా నరసాపురాన్ని ప్రకటించాలి
మొగల్తూరు గాంధీబొమ్మల సెంటర్‌లో ధర్నా

బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా

పాఠశాలలు మూసివేత  

మొగల్తూరు, జనవరి 28 :  నరసాపురం జిల్లా కేంద్రాన్ని నరసాపురాన్నే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఆల్‌ ఇండియా బీసీ ప్రజా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. స్థానిక పీడీఆర్‌ కాంప్లెక్స్‌ నుంచి ముత్యాలమ్మ గుడి వరకు నిరసన ప్రదర్శన చేశారు. సంఘ నాయకులు కె.సత్యనారాయణ, కండిబోయిన సుబ్రహ్మణ్యం, పెంకే చంటి, కడలి చంటేశ్వరరావు, బర్రి రాబస్వామి, పొన్నపల్లి మోహన్‌, ఆలపాటి నాగేశ్వరరావు, పేట సత్యనారాయణ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల కేంద్రాల ఏర్పాటు విషయంలో వివక్ష చూపింద న్నారు. ఆందోళనలో వేండ్ర నాగరాజు, చింతోజ్‌ పాండురంగారావు, కడలి ఏడుకొం డలు,  మోటుపల్లి ముత్యాలరావు, రాయుడు కృష్ణారావు, జక్కంశెట్టి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

మొగల్తూరులో పాఠశాలలు బంద్‌..

నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ మొగల్తూరులో శుక్రవారం బంద్‌ నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు ఆధ్వర్యంలో మొగల్తూరు, రామన్నపాలెం, శేరేపాలెం గ్రామాల్లో ఉన్నత, మండల పరిషత్‌ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలలను మూయించివేశారు. ఆందోళనలో మాజీ ఎంపీపీ కత్తిమండ ముత్యాలరావు, వర్ధనపు సుధాకర్‌, పాలా రాంబాబు, పాలా శివ, గూడూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

కోనసీమలో పెదలంక, కనకాయలంక కలపాలి

యలమంచిలి : జిల్లాల పునర్విభజన ప్రక్రియ నేప థ్యంలో మండలంలోని పెదలంక, కనకాయలంక గ్రామా లను ప్రతిపాదిత కోనసీమ జిల్లాలో విలీనం చేయాలని పెదలంక గ్రామ సర్పంచ్‌ తాళ్ళ నాగరాజు ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలాన్ని అనుకుని, కనకాయలంక గ్రామం పి.గన్నవరం మండలాన్ని ఆనుకుని ఉన్నాయన్నారు.

 మంత్రి పదవి కోసం జిల్లా కేంద్రం తాకట్టు

 నరసాపురం, జనవరి 28 : మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు జిల్లా కేంద్రాన్ని తాకట్టు పెట్టి  నరసాపురం భవిష్యత్‌ను కాలరాశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. జిల్లా కేంద్రంగా భీమవరం అని గెజిట్‌ విడుదలై మూడు రోజులు గడిచినా స్థానిక ఎమ్మెల్యేలో చలనం లేకపోవడం బాధాకరమన్నారు. రాజకీయ మనుగడ, ఇతర లబ్ధి కోసయో భీమవరం నాయకులకు లొంగిపోయారన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటైతే నరసాపురం పూర్తిగా అర్హతయిందన్నారు. జిల్లా కేంద్రం నరసాపురంలోనే అంటూ ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చిన ముదునూరి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.  

 ఎమ్మెల్యే ముదునూరి రాజీనామా చేయాలి

జిల్లాల పునర్విభజనలో నరసాపురం తీరప్రాంతానికి తీర అన్యాయం జరిగిందని  టీడీపీ నాయకుడు, ఎన్‌ఆర్‌ఐ కొవ్వలి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్‌ కేంద్రంగా ఉన్న నరసాపురం పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయకుండా మరో ప్రాంతాన్ని ఎలా ఎంపిక చేస్తారంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు తన పదవుల కోసం ఈ ప్రాంతాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎమ్మెల్యే ముదునూరి ఈ ప్రాంత వాసుడు కాకపోవడం వల్ల తీర ప్రాంత ప్రజల బావోధ్వేగాలు ఆయనకు పట్టవన్నారు. ప్రభుత్వానికి ఈ ప్రాంతం గురించి వాదనలు వినిపించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారన్నారు. భీమవరం ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు, శక్తులకు లొంగిపోయరన్నారు. ప్రజలు చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే తన అసమర్థతకు నైతిక బాధ్యత వహించి తక్షణం రాజీనామా చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-01-29T06:02:29+05:30 IST