అమ్మో అక్కడ ఉద్యోగం చేయలేం !

ABN , First Publish Date - 2021-06-18T04:47:09+05:30 IST

మునిసిపాలిటీ ఇంజనీరింగ్‌ విభాగంలో డీఈ పోస్టింగ్‌ అంటే బేంబేలెత్తిపోతున్నారు.

అమ్మో అక్కడ ఉద్యోగం చేయలేం !
నరసాపురం మునిసిపల్‌ కార్యాలయం

నరసాపురంలో డీఈ పోస్ట్‌ అంటే బేంబేలెత్తిపోతున్నారు.

నరసాపురం, జూన్‌ 17: మునిసిపాలిటీ ఇంజనీరింగ్‌ విభాగంలో డీఈ పోస్టింగ్‌ అంటే బేంబేలెత్తిపోతున్నారు. ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. వచ్చినా పట్టుమని ఆరు నెలలు కూడా పని చేయడం లేదు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ముగ్గురు డీఈలు మారి పోయారు. ప్రభుత్వం మారక ముందు ఇక్కడ లక్ష్మినారాయణ దాదాపు రెండేళ్లు పనిచేశారు. అయితే ఇక్కడ పని చేయలేక నూజివీడు వెళ్లిపోయారు. ఆ తరువాత రాజమండ్రి నుంచి ప్రకాశరావును డీఈగా వేశారు. ఆయన కూడా ఆరు నెలలు కూడా ఉండలేదు. తిరిగి రాజమండ్రి వెళ్లిపోయారు. ఆ స్ధానంలో మండపేటలో పనిచేస్తున్న ప్రసాద్‌ను నియమించారు. ఆయన కూడా ఇటీవల బదిలీ అయిపోయారు. దీంతో పాలకొల్లు డీఈని ఇక్కడికి వేశారు. అయితే వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిసింది. వరుసగా.. ఇలా డీఈలు మారడంపై అనేక వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా పనులు చేయించమని అధికారులపై ఒత్తిళ్ళు తీసుకు రావడం, రాజకీయ కారణాల రిత్యా ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే లోగుట్టు ఏమిటన్నది.... నేతలకే ఎరుకా.

Updated Date - 2021-06-18T04:47:09+05:30 IST