వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-10-29T04:53:59+05:30 IST

మండలంలోని నరసాపురంలో కోదండరామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠను వేద పండితులు వైభవంగా నిర్వహించారు.

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ
ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఉత్సవం

నరసాపురంలో కోదండరాముడి కల్యాణోత్సవం


ఇందుకూరుపేట, అక్టోబరు 28 : మండలంలోని నరసాపురంలో కోదండరామస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠను వేద పండితులు వైభవంగా నిర్వహించారు. గురువారం ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్‌ దాసు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 31 అడుగు ధ్వజస్తంభాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్ఠించారు. ఆలయంలో చాలా కాలంగా ధ్వజస్తంభం లేని కారణంగా చైర్మన్‌ వెంకటేశ్వర్లు వారి కుమారుడు దాసు జనార్ధన్‌ ఉభయకర్తగా వ్యవహరించి, నిర్మాణ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేలాదిమంది భక్తుల సమక్షంలో జరిపారు. అనంతరం సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 

Updated Date - 2021-10-29T04:53:59+05:30 IST