తాగునీటి సరఫరా అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-05-22T05:49:50+05:30 IST

వేసవి తాగు నీటి సరఫరాలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైం దని శనివారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అధికార, విపక్ష సభ్యులు మండిపడ్డారు.

తాగునీటి సరఫరా అస్తవ్యస్తం
కౌన్సిల్‌ సమావేశంలో స్వపక్ష, విపక్ష సభ్యులు

వాడీవేడిగా నరసాపురం కౌన్సిల్‌ సమావేశం 

నరసాపురం టౌన్‌, మే 21: వేసవి తాగు నీటి సరఫరాలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైం దని శనివారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో అధికార, విపక్ష సభ్యులు మండిపడ్డారు. చైర్‌పర్సన్‌ వెంకటరమణ అధ్యక్షతన సమావేశంలో  టీడీపీ సభ్యులు పాలూరి బాబ్జీ, జనసేన సభ్యులు బొమ్మిడి సూర్యకుమారి, కొప్పాడి కృష్ణవేణి, తోట అరుణ, వైసీపీ సభ్యులు దిలీఫ్‌, కావలి రామసీత, కేసరి గంగరాజు, సఖినేటిపల్లి సురేష్‌ పట్టణంలో తాగునీటి సమస్యను ప్రస్తావించారు. వేసవి ముగుస్తున్న సమయంలో ఇప్పుడు అద నంగా మంచినీటి ట్యాంకర్లు  పెట్టాలని ప్రతిపాధించడం వల్ల ఉపయోగం ఏమిటంటూ నిలదీశారు.  యర్రమిల్లి షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దుకాణాలను ఎందుకు భర్తీ చేయలేకపోయారంటూ టీడీపీ కౌన్సిలర్‌ పాలూరి బాబ్జీ ప్రశ్నించారు. అనంతరం చైర్‌పర్సన్‌ సభను ముగించే ప్రయత్నం చేశారు. దీనికి వైసీపీ సభ్యుడు వన్నెంరెడ్డి శ్రీనివాస్‌ ఆభ్యంతరం తెలిపి పోడియం ముందు బైఠాయించారు. ఆయనకు విపక్ష సభ్యులు మద్దతుగా నిలిచారు. అయినప్ప టికీ సమావేశాన్ని ముగించారు.  మేనేజర్‌ శివాజీ, వీసీ కొత్తపల్లి నాని, డీఈ ప్రసాద్‌, ఏఈ సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-22T05:49:50+05:30 IST