Abn logo
Oct 17 2020 @ 16:49PM

నారప్ప మొదలవుతోందట!

Kaakateeya

సీనియర్ హీరో, విక్టరీ వెంకటేశ్ నటిస్తోన్న తాజా చిత్రం `నారప్ప`. ధనుష్ నటించిన సూపర్ హిట్ తమిళ సినిమా `అసురన్`కు ఇది తెలుగు రీమేక్. ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్‌ లాక్‌డౌన్‌కు ముందే ప్రారంభమైంది. 


దాదాపు మూడొంతుల షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్‌ పున:ప్రారంభం కాబోతోందట. మిగిలిన భాగం చిత్రీకరణను సింగిల్ షెడ్యూల్‌లోనే పూర్తి చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో సాగే యాక్షన్ డ్రామాగా `నారప్ప` తెరకెక్కుతోంది.

Advertisement
Advertisement
Advertisement