Abn logo
Aug 12 2020 @ 08:53AM

‘నారప్ప’ షూటింగ్ అప్పుడేనా..?

విక్ట‌రీ వెంక‌టేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నారప్ప’. తమిళ చిత్రం ‘అసుర‌న్‌’కు ఇది రీమేక్‌. ఈ సినిమాను ఈ ఏడాది వేస‌విలో విడుద‌ల చేయాల‌నుకుంటే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో సినిమా షూటింగ్ ఆగింది. వెంక‌టేశ్ అభిమానులు ‘నారప్ప’ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రం షూటింగ్ ను జ‌న‌వ‌రిలో స్టార్ట్ చేస్తార‌ట‌. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లోనే సినిమాను విడుదల చేసేలానే స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే భూవివాదాలు, కుల‌వివ‌క్ష నేప‌థ్యాల‌లో సినిమా ఉంటుంది. డి.సురేశ్‌బాబు, క‌లైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement