Jun 27 2021 @ 12:24PM

వెంక‌టేశ్ సినిమాల డిజిట‌ల్ డీల్ పూర్త‌య్యాయా?

సీనియ‌ర్ అగ్ర క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ఇప్పుడు రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ చిత్రాలే నార‌ప్ప‌, దృశ్యం2. ఈ రెండు సినిమాల్లో దృశ్యం2 మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది. కాగా.. నారప్ప సినిమా మ‌రో వైపు స‌న్న‌ద్ధ‌మ‌వుతుంది. లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నార‌ప్ప‌, దృశ్యం2 సినిమాలు రెండింటికీ ఓటీటీ డీల్ పూర్త‌య్యింది. ఈ రెండు సినిమాల‌కు క‌లిపి డిజిట‌ల్ హ‌క్కుల ప‌రంగా నిర్మాత‌ల‌కు డెబ్బై కోట్ల రూపాయ‌లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. కొవిడ్ ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగ‌వుతున్న నేప‌థ్యంలో నార‌ప్ప‌, దృశ్యం2 సినిమాల‌కు సంబంధించిన రిలీజ్ డేట్స్‌పై త్వ‌ర‌లోనే మేక‌ర్స్ క్లారిటీ ఇవ్వ‌నున్నారు.