నరకయాతన..!

ABN , First Publish Date - 2021-02-26T04:10:51+05:30 IST

రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో నానాటికీ ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.

నరకయాతన..!
కోర్టు సెంటర్‌ లో ట్రాఫిక్‌



మార్కాపురంలో ట్రాఫిక్‌ సమస్యలు

పార్కింగ్‌కు జాగా కరువు

రోడ్లపై యథేచ్ఛగా ఆక్రమణలు

పట్టించుకోని అధికారులు

ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు 

మార్కాపురం (వన్‌టౌన్‌) ఫిబ్రవరి 25 : రెవెన్యూ డివిజన్‌ కేంద్రమైన మార్కాపురం పట్టణంలో నానాటికీ ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. ఈ రోడ్లపై రాకపోకలు చేయాలంటే నరకం చూడాల్సిందేనని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు లక్షకు పైగా జనాభా, నిత్యం అనేక వేల మంది వచ్చి పోయే పట్టణం, వందలాది నాలుగు చక్రాలు, ద్విచక్ర వాహనాలతో పట్టణం రద్దీగా ఉంటుంది. మార్కాపుర పట్టణ ట్రాఫిక్‌ వ్యవస్థను చక్కదిద్దే పరిస్థితులు తా త్కాలికమనే చెప్పాలి. శాశ్వతమైన చర్యలు లేవు. ప ట్టణ ప్రధాన వీధులతో పాటు మిగతా ప్రాంతాలలో ఒక్క వాహనం ఆగిందంటే చాలు గంటల తరబడి మిగతా వాహనాలు ఆగిపోయి వాహనదారులు, పాద చారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కాపురం పట్టణంలోని పాత బస్టాండ్‌, దోర్నాల సెంటర్‌, ఎన్టీఆర్‌ విగ్రహం, నాయుడు వీధి, తేరు వీధి, రాజాజీ వీధి, అరవింద ఘోష్‌ వీధి, రీడింగ్‌ రూం సెంటర్‌, నటరాజ్‌ హోటల్‌ సెంటర్‌, వెంకటరమణ స్టూడియో వీధి, నెహ్రూ బజార్‌, గాంధీ బజార్‌, కూరగాయల మార్కెట్‌, కోర్టు సెంటర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ తదితర ప్రాంతాలలో నిత్యం ట్రాఫిక్‌ ఇక్కట్లు ఎదురవుతున్నా యి. పట్టణంలో రోడ్లను ఆక్రమించి బంకులు, తోపుడు బండ్లు నిలబెట్టడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం ఆక్రమణలు తొలగించారు. నేటి వరకు మళ్లీ అటువైపు దృష్టి సారించలేదు. ఆటోలు ప్రధాన వీధులలో ఎక్కడ పడితే అక్కడ ఆపే స్తుండడంతో మరినిన ఇబ్బం దులు ఎదురవుతున్నాయి. పట్టణంలో ఆయా వీధులలో వాణి జ్య సముదాయాల వద్ద రోడ్లపైకి ఇనుప మెట్లను 15 అడుగులు ఆక్రమించి నిర్మించారు. దుకాణదారులు తమ దు కాణా ల ముందు రోడ్లను ఆక్రమించి వస్తువులు పెడుతున్నా రు. పట్టణంలోని కొట్ల బజారు, కూరగాయల మార్కెట్‌, నాయుడు, తేరు వీధు, ఐదు రోడ్ల కూడలిలోని ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయాల వద్ద వాహనాల లోడింగ్‌, అన్‌ లోడింగ్‌ ఉదయం 8 గంటలలోపు ముగించుకోవాల్సి ఉండగా అన్నివేళలా ఇక్కడ లో డింగ్‌ అన్‌లోడింగ్‌ సాగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య రెట్టింపవుతోంది. పట్టణంలో సరైన పార్కింగ్‌  జాగాలు లేకపోవడంతో వాహనాలను రోడ్లపైనే వది లేస్తున్నారు. దాదాపు సెల్లార్లు నిర్మించి కూడా వాటిని పార్కింగ్‌కు కేటాయించ కుండా షాపులను అద్దెకు ఇస్తుండటంతో ఆయా వాణిజ్య సముదాయల వద్ద ఎ దురుగా ఉన్న రోడ్లపై ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటో లను నిలిపివేస్తుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరా యం ఏర్పడుతుంది.  కంభం రోడ్డులోని కాలువపై ని ర్మించిన ఆక్రమణలు తొలగిస్తామని దాదాపు 3 నెలల క్రితం తెలిపినా మున్సిపల్‌ కమిషనర్‌ నేటి వరకు తొలగించలేదు.

రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్‌, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి పాత రికార్డుల ప్రకా రం హద్దులు గుర్తించి ఆక్రమణలు తొలగిస్తే ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.  పట్టణంలో ఒక్క ఫుట్‌ పాత్‌ కూడా లేదంటే పాదచారులు ఎంత ఇ బ్బంది పడుతున్నారో అర్ధమవుతుంది. ట్రాఫిక్‌ నియంత్రించేందుకు పట్టణంలో ఒన్‌వే ప్రవేశపెట్టాలని ఎప్ప టి నుంచో ప్రయత్నాలు జరిగినా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. విశ్వేశ్వర హాల్‌ నుంచి తూర్పు వీధి, రథం వీధి, అరవింద ఘోష్‌ వీధి, చెరువు అలుగు, ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ఉన్న ఆక్రమణలు తొలగించి వన్‌ వేగా మార్చవచ్చు. దరిమడుగు గుండ్లకమ్మ బ్రిడ్జి నుంచి కంభం  రోడ్డు గుండ్లకమ్మ బ్రిడ్జి వరకు ఉన్న కొచ్చెర్లకోట కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగించి పట్టణంలో వన్‌ వేకు అనుకూలంగా మార్చవచ్చు. ఇప్పటికైనా అధికారులు ట్రాఫిక్‌ సమస్యను తీర్చి వా హనాలకు పార్కింగ్‌ స్థలాలు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. 





Updated Date - 2021-02-26T04:10:51+05:30 IST