రిపబ్లిక్ సినిమాపై నారా లోకేశ్ ట్వీట్

ABN , First Publish Date - 2021-10-03T20:56:20+05:30 IST

దేవ్ కట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

రిపబ్లిక్ సినిమాపై నారా లోకేశ్ ట్వీట్

ఇంటర్నెట్ డెస్క్: దేవ్ కట్టా దర్శకత్వంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ గురించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ సినిమా గురించి మంచి రివ్యూలు వింటున్నానంటూ లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే సినిమా చూస్తానని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని లోకేశ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. 


‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ మంత్రులు పోటీపడి మరీ ఖండించారు. ఇక ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను సమర్థించింది. రాజకీయ కథాoశంగా తెరకెక్కిన ఈ సినిమాపై తాజాగా లోకేశ్ ట్వీట్ చేయటం రాజకీయ వర్గాలు, మెగా ఫ్యాన్స్‌లో చర్చనీయాంశంగా మారింది.



Updated Date - 2021-10-03T20:56:20+05:30 IST