సీఎం జగన్‌పై సెటైర్లు వేసిన లోకేష్

ABN , First Publish Date - 2020-02-16T22:48:50+05:30 IST

సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్లు వేశారు. కేంద్రం మెడలు వంచేస్తానన్న నేత సోషల్ మీడియాకు భయపడటమేంటని ప్రశ్నించారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన..

సీఎం జగన్‌పై సెటైర్లు వేసిన లోకేష్

విజయవాడ: సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సెటైర్లు వేశారు. కేంద్రం మెడలు వంచేస్తానన్న నేత సోషల్ మీడియాకు భయపడటమేంటని ప్రశ్నించారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. బీసీలకు చెందాల్సిన నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించారని పులివెందుల టీడీపీ కార్యకర్త విజయ్ పోస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. ముసుగు వేసి మీడియా ఎదుట హాజరుపరుస్తారా? అని ఫైర్ అయ్యారు. జగన్ మెప్పుకోసం ప్రయత్నిస్తున్న అధికారులు.. కోర్టులు తిట్టే పరిస్థితి తెచ్చుకోవద్దు అని లోకేష్ హితవు పలికారు. విజయ్ పోస్టును తాను కూడా పోస్ట్ చేస్తున్నానని, ఏం చేస్తారో చేసుకోండంటూ సవాల్ విసిరారు. ఇదంతా చూస్తుంటే.. విజయ్ పులివెందుల పులి అయితే.. జగన్ పులివెందుల పిల్లి అని అర్థమవుతోందని లోకేష్ సెటైర్లు వేశారు.

Updated Date - 2020-02-16T22:48:50+05:30 IST