కాకినాడ : సుబ్రమణ్యం కుటుంబసభ్యులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆయన ఫోన్‌లో పరామర్శించారు. సుబ్రమణ్యం కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు. యువకుడిని అన్యాయంగా చంపేశారన్నారు. కట్టుకథలతో కేసును తప్పుదోవ పట్టించారన్నారు. వైసీపీ నేతను కాపాడేలా వ్యవహరించడం దారుణమని నారా లోకేష్ పేర్కొన్నారు.