వై.కోటలో నారా లోకేశ్‌

ABN , First Publish Date - 2021-04-11T04:37:56+05:30 IST

ఓబులవారిపల్లె మండలం వై.కోటలో టీడీపీ తెలుగు యువత నాయకుడు సునీల్‌ వివాహ రిసెప్షన్‌కు శనివారం టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరయ్యారు.

వై.కోటలో నారా లోకేశ్‌
వై.కోటలో నారా లోకేశ్‌కు స్వాగతం పలుకుతున్న టీడీపీ కార్యకర్తలు

ఓబులవారిపల్లె, ఏప్రిల్‌ 10: ఓబులవారిపల్లె మండలం వై.కోటలో టీడీపీ తెలుగు యువత నాయకుడు సునీల్‌ వివాహ రిసెప్షన్‌కు శనివారం టీడీపీ జాతీయ ప్రధా న కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరయ్యారు. సునీల్‌ కుటుంబ సభ్యులతో కలిసి నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున లోకేశ్‌కు టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాధనాయుడు, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నేతలు నాగరాజు, బి.చలపతి, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T04:37:56+05:30 IST