వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తప్ప ఎవరూ సుఖంగా లేరు: లోకేష్

ABN , First Publish Date - 2020-12-05T21:58:24+05:30 IST

జగన్ ప్రభుత్వం వచ్చాక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తప్ప ఎవరూ సుఖంగా లేరని నారా లోకేష్ అన్నారు. కారంచేడులో నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులతో

వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తప్ప ఎవరూ సుఖంగా లేరు: లోకేష్

ప్రకాశం: జగన్ ప్రభుత్వం వచ్చాక వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తప్ప ఎవరూ సుఖంగా లేరని నారా లోకేష్ అన్నారు. కారంచేడులో నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులతో ప్రస్తుత పరిస్థితులను లోకేష్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పాదయాత్రలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి అన్నీ ధరలను పెంచుకుంటూ పోతున్నారు. రైతు రాజ్యం తెస్తానని రైతులు లేని రాజ్యం తెస్తున్నారు. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి. ఆదాయం తగ్గింది. జగన్ రెడ్డి అన్నీ మాటలు తప్పారు. మడమ తిప్పారు. చంద్రబాబు పోరాటం తర్వాత అర్ధరాత్రి రైతులకు 600 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు విడుదల చేశారు’ అని చెప్పారు.


‘మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న కరకట్ట కమల్ హాసన్ ప్రభుత్వం వద్ద విత్తనాలు తీసుకుని సాగు చేసినా మొలకలు కూడా రాలేదు. రైతుల పొలాలకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. రైతులు నిలదీస్తే మంత్రులు బూతులు మాట్లడుతున్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నారని చెబుతున్నారు.. నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని ఆయన చెప్పినా దానికి స్పందించరు. రైతులకు ఇబ్బంది జరిగితే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. చంద్రబాబు శాసనసభలో సింహం లాగా రైతు సమస్యలపై పోరాడుతున్నారు. కోవిడ్ నిబంధనల వల్ల పెద్ద ఉద్యమాలు చేయలేకపోతున్నాం. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ ఇంటిని ముట్టడిస్తాం. ప్రభుత్వం ప్రతీ హెక్టారుకు 30 వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి. ప్రజల తరఫున ఏ పొరటానికైనా సిద్ధం. రైతుల బోర్లకు మోటార్లు బిగిస్తే స్వయంగా వచ్చి పగులగొట్టి తీరతాం’ అని నారా లోకేష్ హెచ్చరించారు.

Updated Date - 2020-12-05T21:58:24+05:30 IST