రూపాయి ఇవ్వకుండా రైతు రాజ్యం అవుతుందా?: నారా లోకేశ్

ABN , First Publish Date - 2020-10-30T17:05:45+05:30 IST

అధిక వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు. మీడియాతో శుక్రవారం మాట్లాడిన ఆయన..

రూపాయి ఇవ్వకుండా రైతు రాజ్యం అవుతుందా?: నారా లోకేశ్

అమరావతి: అధిక వర్షాలు, వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ వ్యాఖ్యానించారు. మీడియాతో శుక్రవారం మాట్లాడిన ఆయన.. తనపై విమర్శలు చేసిన మంత్రులకు కౌంటర్ ఇచ్చారు. తనకు హోదా లేదని.. ఆవేదన ఉందన్నారు. తనను ఎద్దు అని ఒక మంత్రి అన్నారని.. మరి గాల్లో తిరిగిన ముఖ్యమంత్రి జగన్‌ను ఏమనాలని ప్రశ్నించారు. వారం మునిగితేనే సహాయం అంటారా.. మానవత్వం లేదా అని మండిపడ్డారు. గోదావరి జిల్లాల్లో వరి పంట మూడు సార్లు మునిగిందని, రాయలసీమలో 10 లక్షల ఎకరాల వేరుశెనగ దెబ్బతిన్నదన్నారు. తిత్లీ వస్తే తమ ప్రభుత్వ హాయాంలో 28 రోజుల్లో సిక్కోలుకు 160 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక 25 లక్షల రూపాయల సహాయం మాత్రమే చేశారన్నారు. రైతుకు రూపాయి ఇవ్వకుండా రైతు రాజ్యం ఎలా అవుతుందని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. 

Updated Date - 2020-10-30T17:05:45+05:30 IST