ఇంతమందిని మోసం చేసి పండుగలు చేసుకుంటున్నారంటే..: నారా లోకేష్

ABN , First Publish Date - 2020-05-30T16:14:22+05:30 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఏడాది పాలనను ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

ఇంతమందిని మోసం చేసి పండుగలు చేసుకుంటున్నారంటే..: నారా లోకేష్

అమరావతి: ఏపీ సీఎం జగన్ ఏడాది పాలనను ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. జగన్ ఏడాది పాలనలో 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలు ఉన్నాయని పేర్కొన్నారు.


‘‘జగన్ గారి ఏడాది పాలన గురించి చెప్పాలంటే 65 కోర్టు మొట్టికాయలు, రాజ్యాంగ అతిక్రమణలు, కోర్టు ధిక్కారాలు, జాతీయ స్థాయిలో తుగ్లక్ ప్రభుత్వం, తీవ్రవాద ప్రభుత్వం అంటూ వచ్చిన బిరుదులు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, భజనలు, దౌర్జన్యాలు అని చెప్పుకోవాలి. 


ఇక ప్రజల బాగు విషయానికి వస్తే 60 మంది నిర్మాణరంగ  కార్మికులు, 65 మంది రాజధాని రైతులు, 750 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. 160 రోజులుగా అమరావతి కోసం మహిళల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు.


బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ దగాపడ్డారు. ఇంతమందిని నమ్మించి మోసం చేసి బాధపెడుతూ ఏడాది పాలన అంటూ పండగలు చేసుకుంటున్నారంటే శాడిజం కాక ఇంకేంటి? ఇకనైనా పాలకులు పాలన అంటే ఏమిటో తెలుసుకోవాలి. తెలుగువారి పరువుతీయకుండా పాలించాలి’’ అని నారా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2020-05-30T16:14:22+05:30 IST