అమరావతి : ఏపీలో పట్టపగలు మహిళలు నడవలేని దుస్థితి ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ ముసుగు కప్పుకున్న నీచులు... ఆడబిడ్డలపై అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. మద్యపాన నిషేధం వరం ఇస్తున్నానని జగన్‌రెడ్డి తెలిపారు. సొంత మద్యాన్ని అమ్ముతూ అక్కాచెల్లెమ్మల పుస్తెలు తెంపేస్తున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు.. మహిళా ద్రోహిగా సాగుతున్న జగన్ రెడ్డి పాలనని నిరసిస్తూ... ఈ నెల 31న తెలుగు మహిళ ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష నిర్వహించనున్నామని తెలిపారు. భద్రత, భవిష్యత్ కోసం మహిళలు సాగించే పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని నారా లోకేష్ పేర్కొన్నారు.