అవినీతి పరుడే.. అవినీతిని అరికడతాడంట!...: Nara Lokesh

ABN , First Publish Date - 2022-06-02T20:58:32+05:30 IST

నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

అవినీతి పరుడే.. అవినీతిని అరికడతాడంట!...: Nara Lokesh

Amaravathi: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ముఖ్యమంత్రి జగన్‌ (Jagan)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జ‌గ‌న్‌రెడ్డి అవినీతిని అరికడతామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేనన్నారు. యాప్‌కి 14400 నెంబ‌ర్‌ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేదన్నారు. ‘‘అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తున్న అవినీతి అనకొండ జగన్ రెడ్డి గారూ.. అవినీతిపై ఈ నేతిబీరకాయ క‌బుర్లు మాని.. మీపై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?’’ అని లోకేష్ సవాల్ చేశారు. 

Updated Date - 2022-06-02T20:58:32+05:30 IST