Amaravathi: చేతగానితనాన్ని ఇతరులపైకి నెట్టేయడం.. చేసిన నేరాలు, అక్రమాలకు ఇతరుల్ని బాధ్యులను చేయడం జగన్ (Jagan) అండ్ కో ట్రేడ్ మార్క్ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) విమర్శించారు. మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి పేపర్ లీక్ ఘటనలపై మంత్రి బొత్స, సీఎం జగన్ రెడ్డి చేసిన విరుద్ధ ప్రకటనలు ప్రజలంతా చూసారన్నారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడంతో పాటు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే టీడీపీ నేత నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఆరోపించారు. సంబంధంలేని కేసులో నారాయణ దంపతులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో అసలు సూత్రధారులైన వైసీపీ నేతల్ని వదిలేసి టీడీపీ నేతల్ని అరెస్ట్ చేయించి సైకో ఆనందం పొందొచ్చు కానీ.. పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎటువంటి మేలు జరగదని నారా లోకేష్ అన్నారు.
ఇవి కూడా చదవండి