అమరావతి: మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం మరో కోడి కత్తి డ్రామాలాంటిదేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కొల్లు రవీంద్ర లాంటి బీసీ నేతను రాజకీయంగా అణిచివేసే కుట్ర ఇదని విమర్శించారు. కొల్లు రవీంద్రను పోలీసులు వేధించడం ఆపి నాటకం గుట్టు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.