దేవాన్ష్‌ పుట్టినరోజు.. తిరుమలలో అన్నదానం

ABN , First Publish Date - 2022-03-22T01:05:00+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిరుమల అన్నదానం కాంప్టెక్స్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.

దేవాన్ష్‌ పుట్టినరోజు.. తిరుమలలో అన్నదానం

తిరుమల: టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తిరుమల అన్నదానం కాంప్టెక్స్‌లో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఏటా దేవాన్ష్‌ పుట్టినరోజున భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించేందుకు ఒక్కరోజు అయ్యే  మొత్తం ఖర్చు రూ.30 లక్షలను విరాళంగా ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా చంద్రబాబు కుటుంబం ఇప్పటికే రూ.30 లక్షల విరాళాన్ని అందజేసిన క్రమంలో ‘టుడేస్‌ ఫుల్‌డే డోనర్‌ మాస్టర్‌ నారా దేవాన్ష్‌’ అనే పేరుతో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదాలను వితరణ చేశారు. 

Updated Date - 2022-03-22T01:05:00+05:30 IST