వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్టు సాయం

ABN , First Publish Date - 2021-12-20T19:49:30+05:30 IST

సమాజానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జీవితాన్ని అంకితం చేశారని ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు.

వరద బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్‌ ట్రస్టు సాయం

తిరుపతి: చిత్తూరు, కడప, నెల్లూరు వరదల్లో మృతిచెందిన 48 మంది వరద బాధిత కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల సాయాన్ని సోమవారం అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్టు మేనేజింగు ట్రస్టీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ.. వేల సంవత్సరాలు ఒకే టెంపరేచర్ ఉండేది. ఇప్పుడు వాతావరణ కాలుష్యం వల్ల వేడి పెరిగిందన్నారు. కాలుష్య నివారణపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. అసూయ ద్వేషం బదులు ప్రేమను కలిగి ఉండాలని సూచించారు. తప్పు చేసి పాపులు కాకూడదన్నారు. ఎల్లప్పుడు దయతో ఇతరులకు ఉపయోగపడే పనులతో సంతోషంగా జీవించాలన్నారు. పరిస్థితి అనుకూలం కానప్పుడు వేలెత్తి చూపుతారని చెప్పారు. ఎన్టీఆర్ తన జీవితంతో, చర్యలతో మార్గదర్శి అయ్యారని, సమాజానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జీవితాన్ని అంకితం చేశారన్నారు.  మన సంస్కృతి మూలన్ని ఆయన ఏనాడు మరవలేదన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశయాలను, సేవలను సమాజంలోకి తీసుకుపోతున్న ట్రస్ట్ వలంటీర్స్‌కు నారా భువనేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2021-12-20T19:49:30+05:30 IST