ఫ్రెంచ్ ఒపెన్ టోర్నీ నుంచి వైదొలిగిన జపాన్ టెన్నిస్ స్టార్

ABN , First Publish Date - 2020-09-18T17:18:17+05:30 IST

జపాన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబరు 3 క్రీడాకారిణి నయోమి ఒసాకా గాయం కారణంగా త్వరలో జరగబోయే ఫ్రెంచ్ ఒపెన్ టోర్నీ నుంచి వైదొలిగింది....

ఫ్రెంచ్ ఒపెన్ టోర్నీ నుంచి వైదొలిగిన జపాన్ టెన్నిస్ స్టార్

టోక్యో (జపాన్): జపాన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబరు 3 క్రీడాకారిణి నయోమి ఒసాకా గాయం కారణంగా త్వరలో జరగబోయే ఫ్రెంచ్ ఒపెన్ టోర్నీ నుంచి వైదొలిగింది.. ‘‘గాయం కారణంగా రోలాండ్ గారస్ లో జరగబోయే ఫ్రెంచ్ ఒపెన్ టోర్నీలో నేను పాల్గొనడం లేదు’’అని 22 ఏళ్ల జపాన్ టెన్నిస్ స్టార్ నయోమి ట్వీట్ చేశారు. గాయం కారణంగా తాను ఈ సంవత్సరం ఫెంచ్ ఓపెన్ ఆడలేనని చెపుతూ, ఈ టోర్నమెంటులో పాల్గొంటున్న ఇతర క్రీడాకారులకు నయోమి శుభాకాంక్షలు తెలిపారు.


 గత వారం జరిగిన 2020 యూఎస్ ఓపెన్ పోటీల్లో ఒసాకా బెలారసియన్ టెన్నిస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకాను ఓడించి రెండవ టైటిల్ ను కైవసం చేసుకుంది. మే 24 నుంచి జూన్ 7వతేదీ వరకు జరగాల్సిన ఫ్రెంచ్ ఓపెన్ ఈ నెల 27 నుంచి అక్టోబరు 11వతేదీ వరకు జరగనుంది. 

Updated Date - 2020-09-18T17:18:17+05:30 IST