ఎంజీఎన్‌సీఆర్‌ఈతో ‘నన్నయ’ అవగాహన ఒప్పందం

ABN , First Publish Date - 2020-11-29T06:30:57+05:30 IST

కేంద్ర మానవవనరులశాఖలో భాగస్వామ్యమైన మహాత్మా గాంఽధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌తో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అవ గా హన ఒప్పందం కుదుర్చుకుందని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. హైదరాబా ద్‌లోని ఎంజీఎన్‌సీఆర్‌ఈ కార్యాలయంలో చైర్మన్‌ డాక్టర్‌ డబ్ల్యుజీ ప్రసన్న కుమార్‌, డైరెక్టర్‌ ఆ చార్య సీహెచ్‌ చేతన్‌, నన్నయ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఆచార్యుడు టేకి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు.

ఎంజీఎన్‌సీఆర్‌ఈతో ‘నన్నయ’ అవగాహన ఒప్పందం
అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న దృశ్యం

దివాన్‌చెరువు, నవంబరు 28: కేంద్ర మానవవనరులశాఖలో భాగస్వామ్యమైన మహాత్మా గాంఽధీ నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌తో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం అవ గా హన ఒప్పందం కుదుర్చుకుందని వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు అన్నారు. హైదరాబా  ద్‌లోని ఎంజీఎన్‌సీఆర్‌ఈ కార్యాలయంలో చైర్మన్‌ డాక్టర్‌ డబ్ల్యుజీ ప్రసన్న కుమార్‌, డైరెక్టర్‌ ఆ చార్య సీహెచ్‌ చేతన్‌, నన్నయ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఆచార్యుడు టేకి ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. దీనిద్వారా డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంలు, సదస్సు లు నిర్వహించడం, గ్రామీణ యువతను పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ ఇస్తారు. గుజరాత్‌లో మాత్రమే ఉన్న ఎంబీఏరూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ను నన్నయ విశ్వవిద్యాలయంలో ప్రారంభించి బీబీఏ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సును అనుబం ధ కళాశాలలద్వారా అందిస్తారు. ప్రత్యేక జాయింట్‌ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందించనున్నారు.

Updated Date - 2020-11-29T06:30:57+05:30 IST