ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే సినీ ప్రముఖులు ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో వీలైనంత సమయం గడుపుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లోకి వస్తున్నారు. పాత ఫొటోలను పోస్ట్ చేస్తూ అప్పటి విశేషాలను పంచుకుంటున్నారు.
తాజాగా నేచురల్ స్టార్ నాని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కతో కలిసి ఉన్న తన చిన్నప్పటి ఫొటోను నాని పోస్ట్ చేశాడు. `కొట్టుకు చచ్చే రోజుల్లో` అని కామెంట్ చేశాడు. అలాగే తన అక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు.