Jul 27 2021 @ 15:56PM

Nani: నాని స్పెష‌ల్ ట్రైనింగ్‌.. దేనికోస‌మో తెలుసా?

నేచుర‌ల్ స్టార్ నాని ఓ విష‌యంపై ప‌ట్టు సాధించ‌డానికి స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. ఇంత‌కీ నాని ఏ విష‌యంలో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నిస్తున్నాడో తెలుసా!.. తెలంగాణ యాస‌పై ప‌ట్టుకోసం. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో నాని సినిమా చేయబోతున్నాడు. ఇందులో నాని తెలంగాణ యువ‌కుడిగా క‌నిపించ‌బోతున్నాడు. ఆ పాత్ర కోసం నాని ఓ ట్యూట‌ర్‌ను పెట్టుకుని యాస నేర్చుకుంటున్న‌ట్టు స‌మాచారం. రీసెంట్‌గానే ‘శ్యామ్ సింగ‌రాయ్’ సినిమాను పూర్తి చేసిన నాని, ఇప్పుడు ‘అంటే సుంద‌రానికీ’ సినిమా చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉన్నాడు. దీని త‌ర్వాతే శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నాడు నాని.