Jun 15 2021 @ 00:00AM

ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కోసం..!


హీరో నాని ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల కోసం ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వివరాల్ని ఆయన ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తూ ఎంతోమంది ప్రాణాలను రక్షిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకి బహుమతిగా ‘దారే లేదా’ అనే వీడియో సాంగ్‌ను రూపొందించినట్టు ఆయన తెలిపారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం  సమకూర్చిన ఈ పాటకి కె.కె. సాహిత్యం అందించారు. సత్యదేవ్‌, రూప ఈ పాటలో కనిపించనున్నారు. వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నాని సమర్పణలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ పాటను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.