Abn logo
Mar 29 2020 @ 19:15PM

ఇంట్లోనే తనయుడి బర్త్ డే వేడుక.. వీడియో షేర్ చేసిన నాని

లాక్ డౌన్ కారణంగా సినీ సెలబ్రెటీలు కూడా ఇంటికే పరిమితమవుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతున్నారు. పుట్టిన రోజు వేడుకలు, ఇతర కార్యక్రమాలను కూడా ఇంట్లోనే జరుపుకుంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇలా యంగ్ హీరో నాని కూడా ఇంట్లోనే ఎంజాయ్ చేస్తున్నారు. నాని తనయుడు అర్జున్ (జున్ను) మూడవ పుట్టిన రోజు వేడుకను ఇంట్లోనే జరుపుకున్నారు. ఈ సందర్భంగా హీరో నాని ఐరన్ మేన్ మాస్క్ పెట్టుకుని సందడి చేశారు. తనయుడిపై ముద్దుల వర్షం కురిపిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇక తన తండ్రి నాని ముఖాన్ని గిల్లుతూ అర్జున్ అల్లరి చేశారు. ఈ వీడియోను నాని ప్రేక్షకులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘ఊరికే అలా.. జున్నుగాడి’తో అంటూ ట్వీట్ చేశారు. 


హీరో నాని షేర్ చేసిన వీడియో కోసం క్లిక్ చేయండి..


Advertisement
Advertisement
Advertisement