నేచురల్ స్టార్ నాని ఇటీవల వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో 'దసరా' మూవీ ఒకటి. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రా శ్రీకాంత్ ఒదెల దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో నాని నెగిటివ్ రోల్లో కనిపించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకముందు 'జెంటిల్ మేన్', 'వి' చిత్రాల్లో నాని విలన్ తరహా పాత్రలో నటించి మెప్పించాడు. మరోసారి అలాంటి పాత్రలోనే నటిస్తున్నాడని సమాచారం. బొగ్గుగని బ్యాక్డ్రాప్లో రూపొందనున్న దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.