Sep 17 2021 @ 11:00AM

Nani: దసరా రోజు కొత్త కబురు..!

నేచురల్ స్టార్ నాని దసరా పండుగ రోజు కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన విషయాలను వెల్లడించనున్నట్టు తాజా సమాచారం. ఇటీవలే 'టక్ జగదీశ్' సినిమాతో వచ్చి  ఆకట్టుకున్నాడు నాని. ప్రస్తుతం 'శ్యామ్‌ సింగరాయ్‌' మూవీని రిలీజ్‌కి రెడీ చేస్తున్నాడు. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోల్ కతా బ్యాక్‌డ్రాప్‌లో తయారవుతోంది. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇక ‘అంటే సుందరానికి’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్‌ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడట నాని. దీనికి సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. విజయదశమి పండుగ సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో పాటు చిత్ర టైటిల్ సహా ఇతర విషయాలను వెల్లడించనున్నారని లేటెస్ట్ అప్‌డేట్. కాగా నిర్మాతగా తన సోదరి దీప్తిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ మీట్ క్యూట్ అనే విభిన్న కథా చిత్రాన్ని నిర్మిస్తున్నాడు నాని.