Sep 15 2021 @ 12:15PM

Nani: బయటెక్కడో ఉన్నాడు.. ఉండకూడదు

"బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు" అంటూ టాలీవుడ్ హీరో నాని చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు అంటుకుంటున్నాయి. ప్రజలతో పాటు సినీ తారలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, మహేష్ బాబు లాంటి వారు స్పందించారు. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ  ప్రశ్నగానే మిగిలిపోతుందా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం'.. అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఇదే క్రమంలో తాజాగా నాని కూడా ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ.."బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు".. ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి జారీ చేసిన వాంటెడ్ నోట్‌ను సైతం జత చేశారు.