Oct 27 2020 @ 15:31PM

అవసరాల సినిమాకు నాని గ్రీన్ సిగ్నల్?

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో `టక్ జగదీష్` సినిమా చేస్తున్నాడు. అలాగే రాహుల్ సంకృత్యాన్ `శ్యామ్ సింగరాయ్` సినిమానూ ప్రారంభించబోతున్నాడు. `శ్యామ్ సింగరాయ్`  తర్వాత సెన్సిబుల్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్‌తో నాని కలిసి పనిచేయబోతున్నాడట. 


`ఊహలు గుసగుసలాడే`, `జ్యోఅచ్యుతానంద` సినిమాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న అవసరాల.. నాని కోసం ఓ కథను సిద్ధం చేశాడట. లాక్‌డౌన్ సమయంలో వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయట. కథ నచ్చడంతో నాని ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితియార్థంలో పట్టాలెక్కబోతున్నట్టు సమాచారం.