Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 01 Jul 2022 17:22:18 IST

నాని Dasara మూవీ లేటెస్ట్ అప్‌డేట్..

twitter-iconwatsapp-iconfb-icon

నేచురల్ స్టార్ నాని (Nani) నటిస్తున్న ‘దసరా’ (Dasara) మూవీ నుంచి మేకర్స్ లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చారు. గత యేడాది చివరిలో నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. తాజాగా నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthi Suresh) హీరోయిన్‌గా నటిస్తోంది. నాని తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. 

నాని కెరీర్‌లో ఇది వరకు చేయని ఓ పక్కా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా ఇదే. అంతేకాదు, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రచార చిత్రాలతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఇటీవల ఈ మూవీ చిత్రీకరణ దశలోనే ఆగిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై క్లారిటీ కూడా ఇచ్చారు. అవన్నీ పూర్తిగా రూమర్స్ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. 

ఇక, ఈ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం ఇచ్చింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను వదిలారు. దీనిలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నట్టుగా తెలిపారు. ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరపనుండగా, చిత్రంలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనబోతున్నారట. ఈ షెడ్యూల్ కోసం ఓ భారీ సెట్‌ను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌తో చాలా వరకు ‘దసరా’ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందట. కాగా, ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement