విష్వక్సేన్, రుహానీ శర్మ హీరోహీరోయిన్లుగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'హిట్'. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ విజయం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందనేలా వార్తలు వచ్చాయి. అయితే నాని కాకుండా ఈ సీక్వెల్‌ను వేరే బ్యానర్లో చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, హిట్ చిత్ర సీక్వెల్‌ని కూడా నానినే నిర్మిస్తారని తెలుస్తుంది. అయితే.. ఈసారి ఈ చిత్రంలో హీరో మారుతున్నాడని అంటున్నారు.
హిట్ 2 చిత్రంలో విష్వక్సేన్ ప్లేస్‌ని అడవి శేష్‌తో రీ ప్లేస్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి సీక్వెల్స్ అంటే.. ఖచ్చితంగా అదే హీరో ఉంటాడు. కానీ.. హీరో నాని మాత్రం హీరోని మార్చి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లుగా టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినవస్తున్నాయి. మరి ఈ వార్తలపై నాని అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూద్దాం.