Road accident: పెళ్లి లారీ బోల్తా...ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-05-13T14:01:35+05:30 IST

జిల్లాలోని నంద్యాల మండలం పోలూరు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

Road accident: పెళ్లి లారీ బోల్తా...ఇద్దరు మృతి

నంద్యాల: జిల్లాలోని నంద్యాల(Nandyala) మండలం పోలూరు వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెళ్లి లారీ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more