Nandyala: ఆత్మకూర్‎లో దారుణం..

ABN , First Publish Date - 2022-05-08T13:57:22+05:30 IST

ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను, కన్నకొడుకును కత్తితో భర్త దాడి చేశాడు. అర్ధరాత్రి పీకల్లోతూ

Nandyala: ఆత్మకూర్‎లో దారుణం..

నంద్యాల: ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యను, కన్నకొడుకును కత్తితో భర్త దాడి చేశాడు. అర్ధరాత్రి పీకల్లోతూ తాగి వచ్చి భార్య, కొడుకుతో ఘర్షణకు దిగాడు. ఈ వివాదం కాస్త తీవ్రస్థాయిలో ముదరడంతో ఆగ్రహానికి గురైన భర్త మహబూబ్ బాషా కత్తితో ఇద్దరి కడుపులో పొడిచి పరారయ్యాడు. ఈ దాడిలో కొడుకు యాసిన్‎కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఇద్దరిని ఆత్మకూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more