బెయిల్‌ రద్దు విచారణ వాయిదా

ABN , First Publish Date - 2020-11-24T06:10:09+05:30 IST

అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులు సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ల బెయిల్‌ రద్దు పిటీషన్‌ విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

బెయిల్‌ రద్దు విచారణ వాయిదా

  1. సలాం కేసులో కొనసాగుతున్న వాదనలు

నంద్యాల (నూనెపల్లె), నవంబరు 23: అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులు సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ల బెయిల్‌ రద్దు పిటీషన్‌ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. సలాం కేసులో నిందితులుగా ఉన్న సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ళ్లకు ఈనెల 9వ తేదీన బెయిల్‌ మంజూరైంది. అయితే ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో జిల్లా మూడో  అదనపు కోర్టులో పిటీషన్‌ వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు బెయిల్‌ రద్దు విచారణ ఐదుసార్లు వాయిదా పడింది. సోమవారం నంద్యాలలోని జిల్లా కోర్టులో సలాం కుటుంబ సభ్యులు, విజయవాడ నుంచి ఏపీ రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ సుధాకర్‌రెడ్డి ఆన్‌లైన్‌లో తమ  వాదనలను జడ్జికి వినిపించారు. సాంకేతిక లోపంతో సిగ్నల్‌ కట్‌ కావడంతో వాదన నిలిచిపోయింది. విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు జడ్జి సువర్ణరాజు తెలిపారు. 

Updated Date - 2020-11-24T06:10:09+05:30 IST