నందికొట్కూరును కర్నూలు జిల్లాలో చేర్చాలి

ABN , First Publish Date - 2022-01-29T04:52:59+05:30 IST

నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో చేర్చాలని సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, గోపాలక్రిష్ణ, నాగార్జున అన్నారు.

నందికొట్కూరును కర్నూలు జిల్లాలో చేర్చాలి
వినతి పత్రం అందజేస్తున్న నాయకులు సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు

సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ డిమాండ్‌

నందికొట్కూరు రూరల్‌, జనవరి 28: నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో చేర్చాలని సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, గోపాలక్రిష్ణ, నాగార్జున అన్నారు. శుక్రవారం నందికొట్కూరు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద సీపీఐ ఎంఎల్‌ లిబరేషన్‌ ఆధ్వర్యంలో జిల్లాల పునర్విభజనపై నిరసన తెలిపారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌ పద్మావతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంది కొట్కూరు నియోజకవర్గాన్ని 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న నంద్యాల జిల్లాకు కలిపినట్లు చూపిస్తున్నారని ఇది మరీ విడ్డూరంగా ఉందని అన్నారు. కర్నూలు జిల్లాకు కేవలం 28 కిలో మీటర్లు దూరంలో ఉన్న నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలులో కలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనియెడల ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

నందికొట్కూరు: నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలపాలని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రభుత్వం జిల్లాల పున ర్విభజన సందర్భంగా నందికొట్కూరును నంద్యాల జిల్లాలలో కలపడం అశాస్త్రీయమన్నారు. నందికొట్కూరు, జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు మండలాలను కర్నూలులో కలపాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ రాజశేఖర్‌బాబుకు వినతి పత్రం అందజేశారు. 

కోవెలకుంట్ల: బనగానపల్లెను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి కోరారు. థ్యాంక్యు సీఎం సార్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కోవెలకుంట్ల పట్టణంలోని పాత బస్టాండు నుంచి వీఆర్‌ఎన్‌ ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం వీఆర్‌ఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యు రాలు గోపిరెడ్డి వెంకటలక్ష్మమ్మ, ఎంపీపీ భీమిరెడ్డి రమాదేవి, వైసీపీ మండల కన్వీనర్‌ భీమిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, పట్టణ ఉప సర్పంచ్‌ జీసీఆర్‌ సూర్య నారాయణరెడ్డి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ బీవీ నాగార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-29T04:52:59+05:30 IST