Nandikondaలపై ప్రవేశానికి మళ్లీ అనుమతి

ABN , First Publish Date - 2021-12-02T18:23:52+05:30 IST

చిక్కబళ్లాపుర జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన నందికొండల సందర్శనకు అనుమతించారు. ఆగస్టు 24న భారీ వర్షాల కారణంగా నందికొండల రహదారి ప్రదేశం భూమి కుంగిపోయింది. దీంతో పర్యాటకుల రాకపై నిషేధం

Nandikondaలపై ప్రవేశానికి మళ్లీ అనుమతి

బెంగళూరు: చిక్కబళ్లాపుర జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక క్షేత్రమైన నందికొండల సందర్శనకు అనుమతించారు. ఆగస్టు 24న భారీ వర్షాల కారణంగా నందికొండల రహదారి ప్రదేశం భూమి కుంగిపోయింది. దీంతో పర్యాటకుల రాకపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. జిల్లా యంత్రాంగం, పర్యాటకశాఖ యుద్ధప్రాతిపదకన రూ.80 లక్షల ఖర్చుతో దెబ్బతిన్న రహదారి మార్గాన్ని పూర్తి చేశారు. దీంతో నందికొండలపైకి మళ్లీ రాకపోకలకు అనువైన వాతావరణం ఏర్పడింది. రాష్ట్ర పర్యాటకశాఖ ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా వారాంతపు రోజుల్లో ముందు జాగ్రత్తగా పర్యాటకులను నందికొండలపైకి అనుమతించడం లేదని, ఇతర రోజుల్లో కొవిడ్‌ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పర్యాటకులకు సూచించారు. నందికొండలపై ముందస్తుగా వసతిని రిజర్వు చేసుకున్నవారికి మాత్రమే వారాంతపు రోజుల్లో అనుమతి ఇవ్వనున్నట్టు ప్రకటన పేర్కొంది. 

Updated Date - 2021-12-02T18:23:52+05:30 IST