అందరికీ ఈ చిత్రం నాంది

ABN , First Publish Date - 2021-02-26T06:16:38+05:30 IST

మొట్టమొదట చిత్రంగా తీసిన దర్శకుడు విజ య్‌ కనకమేడల, ప్రొడ్యూసర్‌ సతీష్‌ వేగేశ్నలతోపాటు ఇప్పటివరకు కామెడీ రోల్‌లో నే చేసిన నాకు అందరికీ ఈచిత్రం నాంది అని హీరో అల్లరి నరేష్‌ అన్నారు.

అందరికీ ఈ చిత్రం నాంది

 హీరో అల్లరి నరేష్‌

గోదావరి సిటీ,  ఫిబ్రవరి 25: మొట్టమొదట చిత్రంగా తీసిన దర్శకుడు విజ య్‌ కనకమేడల, ప్రొడ్యూసర్‌ సతీష్‌ వేగేశ్నలతోపాటు ఇప్పటివరకు కామెడీ రోల్‌లో నే చేసిన నాకు అందరికీ ఈచిత్రం నాంది అని హీరో అల్లరి నరేష్‌ అన్నారు. నాంది చిత్రం విజయోత్సవం సందర్భంగా హోట ల్‌ లాహాస్పిన్‌లో గురువారం మ ధ్యాహ్నం జరిగిన విలేకరుల సమావేశంలో హీరో అల్లరి నరేష్‌, నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల, ప్రొడ్యూసర్‌ సతీష్‌ వేగేశ్న, కథను అందించిన వెంకట్‌ ఇతర టీమ్‌ సభ్యులు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నరేష్‌ మాట్లాడుతూ ఈకథను నమ్మి టీమ్‌ వర్క్‌గా చేయడమే ఈచిత్రం విజయం అని ఆయన అన్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ ఇది ఒక మంచి సినిమా. ఈ సినిమాను  చూడని వారు తప్పకుం డా చూడండి  అన్నారు.



Updated Date - 2021-02-26T06:16:38+05:30 IST