నందనంలో Metro rail ప్రధాన కార్యాలయం

ABN , First Publish Date - 2022-07-06T13:17:07+05:30 IST

స్థానిక నందనం ప్రాంతంలో రూ.365 కోట్లతో మెట్రోరైల్‌ ప్రధాన కార్యాలయం సిద్ధమవుతోంది. 12 అంతస్థుల ఈ భవనసముదాయ నిర్మాణ పనులు పూర్తి

నందనంలో Metro rail ప్రధాన కార్యాలయం

                          - రూ.365 కోట్లతో 12 అంతస్థులతో కొత్తభవనం


చెన్నై, జూలై 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక నందనం ప్రాంతంలో రూ.365 కోట్లతో మెట్రోరైల్‌ ప్రధాన కార్యాలయం సిద్ధమవుతోంది. 12 అంతస్థుల ఈ భవనసముదాయ నిర్మాణ పనులు పూర్తి కావచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం మెట్రో రైల్‌ ప్రధాన కార్యాలయం కోయంబేడులో వుంది. ఆ భవనంలో వసతులు సరిగ్గా లేవనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగులు ఉండేందుకు తగిన వసతి కూడా లేదు. ఈ పరిస్థితుల్లో నందనంలో కొత్త ప్రధాన కార్యాలయ భవన నిర్మాణ పనులు చేపట్టారు. ‘సీఎంఆర్‌ఎల్‌ భవన్‌’ పేరుతో 12 అంతస్థులతో ఆ భవనం నిర్మించారు. ఇందులోనే మెట్రో  రైల్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటవుతుంది. ఇక్కడ ఆరేసి అంతస్తులతో మరో రెండు భవనాలు కూడా నిర్మిస్తున్నారు. అందులో మెట్రో రైల్‌ ఉన్నతాధికారులు, ఉద్యోగుల నివాసాలు, వాణిజ్య దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఈ భవనసముదాయ నిర్మాణ పనులు వారంలో పూర్తవుతాయని, ఆ తరువాత ఆ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-07-06T13:17:07+05:30 IST