Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 26 May 2022 11:18:41 IST

Mahesh మూవీలో నందమూరి హీరో..?

twitter-iconwatsapp-iconfb-icon

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Super Star Mahesh Babu) హీరోగా తెరకెక్కబోతున్న లేటెస్ట్ మూవీలో నందమూరి హీరో నటించబోతున్నాడనే ఓ తాజా వార్త ప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇటీవలే సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు మహేశ్. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం రెడీ అవుతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్‌తో, ఫిబ్రవరిలో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. జూన్ నుంచి సెట్స్ మీదకు తీసువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించబోతున్న ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ (S S Thaman) సంగీతం అందిస్తున్నాడు. 

అయితే, ఈ మూవీలో ఓ కీలక పాత్ర ఉండగా, దానికోసం నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna)ను తీసుకునేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్టు తాజా సమాచారం. ఆయన తీసే సినిమాలలో సీనియర్ ఆర్టిస్టులను ఎక్కువగా నటింపజేస్తున్న సంగతి తెలిసిందే. అత్తారింటికి దారేది సినిమాలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్బూ, అల వైకుంఠపురములో సినిమాతో టబును తీసుకొచ్చారు. అంతేకాదు, కొందరు ఫేడౌవుట్ హీరోలకు మంచి పాత్రలు ఇచ్చి తెరపైకి తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే నందమూరి తారకరత్నను మహేశ్ సినిమా ద్వారా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందులో నెగిటివ్ రోల్ కోసం ఆయనను తీసుకోబోతున్నట్టు సమాచారం. తారకరత్న హీరోగా ఒకేసారి 11 సినిమాలు మొదలయ్యాయి. అయితే, నాలుగైదు సినిమాల తర్వాత మిగతావేవీ పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో నెగిటివ్ రోల్స్ కూడా చేశారు. కానీ, ఏదీ ఆయనకు అంతగా క్రేజ్ తెచ్చిపెట్టింది లేదనే చెప్పాలి. మరి మహేశ్ - త్రివిక్రమ్ సినిమాలో తారకరత్న నటించేదే నిజమైతే..ఈ పాత్రతోనైనా ఫాంలోకి వస్తారేమో చూడాలి.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement